Vastu tips: కొండలు.. గుట్టల దగ్గర స్థలం కొనవచ్చా.. బాల్కనీ ఇంట్లో ఏ దిక్కులో ఉండాలి..!

Vastu tips: కొండలు.. గుట్టల దగ్గర స్థలం కొనవచ్చా.. బాల్కనీ ఇంట్లో ఏ దిక్కులో ఉండాలి..!

సొంతిల్లు కట్టుకోవాలని అందరూ అనుకుంటారు.  కాని ప్రస్తుత రోజుల్లో స్థలం దొరకడం చాలా కష్టతరంగా మారింది.  ఊరి చివరన కొండలు.. గుట్టలు.. ఎత్తైన ప్రదేశాలకు సమీపంలో  సహజంగా  తక్కువ ధరకు స్థలాలు వస్తాయి. ఆ స్థలాలను కొని ఇల్లు కట్టుకోవచ్చా.. ఇల్లు కట్టుకొనేటప్పుడు బాల్కనీ  నిర్మాణంలో  తీసుకోవాలసిన జాగ్రత్తలు   ఏమిటి.  మొదలగు విషయాలను వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ ( 9440088799) గారి సలహాలను ఒకసారి చూద్దాం

ప్రశ్న: నేను ఊరి అవతల ఒక స్థలం కొన్నాను. అక్కడ ఇల్లు కట్టుకుంటున్నా, స్థలానికి దగ్గరలోనే గుట్ట ఉంది. ఇంటికి దగ్గరలో గుట్ట ఉండొచ్చా?

జవాబు: ఇంటికి దక్షిణం లేదా పడమర వైపు గుట్టలు, కొండలు ఉంటే మంచిది. ఇంటికే కాకుండా, ఫ్యాక్టరీలు. కంపెనీలకు కూడా మేలు జరుగుతుంది. గుట్టలు ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంటే మాత్రం మంచిది కాదు. నష్టాలు వస్తాయి. బావులు.. చెరువులు..కాలువలు అయితే ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యం దిక్కుల్లో ఉండాలి.

ప్రశ్న: నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పనిచేస్తున్నా. ఇంటి బాల్కనీకి కూడా వాస్తు ఉంటుందా? ఉంటే ఇంటికి బాల్కనీ ఏ వైపు ఉండాలి!

జవాబు:  ఇంటికి బాల్కనీ ఉత్తరం లేదా తూర్పు దిక్కుల్లో ఉంటే మంచిది. దాని వల్ల సూర్యకాంతి నేరుగా ఇంట్లో పడుతుంది. సూర్య కిరణాలు ప్రసరించడం వల్ల నెగెటివ్ ప్రభావం ఉండదు.. పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇంటికి తూర్పు ద్వారం ఉండటం కూడా మంచిదే..